ఐటీసీ బంగారు భవిష్యత్తులో భాగంగా చెరువుల పునరుద్దరణ కార్యక్రమ ప్రారంభోత్సవం..
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం టౌన్ బంగారు బవిష్యత్తు ( మిషన్ సునేహారా కాల్) కార్యక్రమంలో భాగంగా శ్రీనివాసపురం గ్రామంలోని ఊరి చెరువు గట్టు బలోపేతం చేసే కార్యక్రమానికి శుక్రవారం ఉదయం భూమి పూజ ఐటీసీ లిమిటెడ్ లో ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఐటీసీ - బంగారు బవిష్యత్తు ఆర్థిక సహకారం తో బైఫ్ మరియు ఐటీసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జడ్పిటిసి పోల్నాటి బాబ్జి టోబాకో బోర్డ్ ఎన్ ఎల్ ఎస్ రీజనల్ మేనేజర్, జి ఎల్ కె ప్రసాద్ మరియు జంగారెడ్డిగూడెం టోబాకో బోర్డ్ యాక్షన్ సూపరింటెండెంట్ మరియు ఐటీసీ లీఫ్ మేనేజర ఎం కూట్రేష్ మరియు ఐటీసీ మార్కెటింగ్ మేనేజర్ పి. ప్రశాంత్ కుమార్ జోషి , బైఫ్ సంస్థ కుమారప్పా ఏసిపి ఈ , ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ హరిప్రసాద్ రావు అలాగే ప్రాజెక్ట్ ఇంజినీర్ వీరేంద్ర పాల్గొన్నారు.
నీటి సామర్ధ్యం పెంచెందుకు
రబి, ఖరీఫ్ పంట ల కు నీటి లభ్యత సమృద్ధి గా ఉండి,
వరదల ముప్పు బారిన పడకుండా రెండు కిలోమీటర్లు సమీపంలో భూగర్భ జలాలు మరియు బోర్లకు ఈ పథకం దోహదపడుతుంది. మార్చ్ 15 లోపు ఈ ప్రాజెక్ట్ ని సుమారు ఆరు లక్షల డబ్బయి వేల వ్యయం తో పూర్తి చేయటానికి సన్నదమయ్యారు ఐ టి సి సిబ్బంది తెలియజేశారు.


