విద్యార్థి దశ నుంచే విద్యార్థులు సైన్స్ పై అవగాహన పెంచుకోవాలి తహసీల్దార్ నాగరాజు......

 విద్యార్థి దశ నుంచే విద్యార్థులు సైన్స్ పై అవగాహన పెంచుకోవాలి  తహసీల్దార్ నాగరాజు......


విద్యార్థి దశ నుంచే విద్యార్థులు సాంకేతికను తయారు చేయడం గ్రౌండ్ వాటర్ పెంపొందించే విధానాన్ని తెలుసుకోవడంపై భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించడం జరుగుతుంది అని కొయ్యలగూడెం మండల తహసీల్దార్ ఎన్ నాగరాజు పేర్కొన్నారు సైన్స్ దినోత్సవ సందర్భంగా కొయ్యలగూడెంలోని సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో కరెస్పాండెంట్ విద్యాసంస్థల అధినేత  రాజ్ కుమార్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని తాసిల్దార్ నాగరాజు పరిశీలించారు విద్యార్థులు తయారు చేసిన పరికరాలు ఒక్కొక్కటిగా పరిశీలించి దాని ఆవశ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనంతరం తాసిల్దార్ నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో దూరం చూపుతో పరికరాలను తయారు చేయడం అభినందనదాయకమని పేర్కొన్నారు భవిష్యత్తు తరాలు మనుగుల సాధించాలంటే కాలుష్య రహిత వాతావరణాన్ని పెంపొందించుకోవాలి అని ఆయన పేర్కొన్నారు ఓజోన్ పొర దెబ్బ తినకుండా వాతావరణ కాపాడుకోవడం ద్వారా జీవరాశుల మనుగడను కాపాడుకోవచ్చు అని ఆయన తెలియజేశారు అందుకు ప్లాస్టిక్ నివారణ ఏకైక మార్గం అన్నారు విద్యార్థినీ విద్యార్థులు ప్రతి ఒక్కరూ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన కోరారు ఫారంపండ్స్ ద్వారా నీటి నిల్వను చేసే విధానాన్ని తెలుసుకొని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలియజేసి నీటిని నిల్వ చేసుకోవాలని తెలియజేశారు విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలో తనను ఎంతగానో అలరించాయి అని తాసిల్దార్ నాగరాజు పేర్కొన్నారు సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్ lo విద్యను అభ్యసించిన విద్యార్థులు నేడు ఎంతో ఉన్నత శిఖరాలను చేరుకొని దేశ విదేశాలలో సుస్థిరమైన స్థానాలలో స్థిరపడ్డారని సిద్ధార్థ స్కూల్స్ అధినేత ఐ రాజ్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఆనంద్ తో పాటుగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు