శంకర్రావును సత్కరిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్ లు.
అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు శంకర్రావుకు మున్సిపల్ కౌన్సిల్ అభినందన జనహితమే ధ్యేయం గా పనిచేశారని చైర్ పర్సన్ బత్తినలక్ష్మి,కౌన్సిలర్ల ఆధ్వర్యంలోసత్కారం
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం జర్నలిస్ట్ గా పేరు గుర్తింపు కోసం కాకుండా మన ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేసినజర్నలిస్ట్ శంకర రావుఅని స్థానిక మున్సిపాలిటీ చైర్ పర్సన్,సభ్యులు అభినందనలు తెలిపారు.
సీనియర్ పాత్రికేయుడైన కె ఎస్ శంకరరావు మీడియా అక్రిడిటేషన్ జిల్లా కమిటీ సభ్యులు గా రాష్ట్రప్రభుత్వం నియమించిన నేపథ్యంలోశనివారం అభినందన సత్కారంజరిగింది.
చైర్ పర్సన్ బత్తిన అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్ లు వైసీపీ నేత బత్తిన చిన్నా, జర్నలిస్ట్లు పాల్గొన్నారు. చైర్ పర్సన్ లక్ష్మి చిన్నా తమ ప్రసంగంలో శంకరరావు మొదటి నుంచీ టౌన్ అభివృద్ధి గురించి కృషి చేశారని కొనియాడారు.అలాగే మున్సిపాలిటీలో ఎక్కడయినా ఇబ్బందులు ఉంటే నిస్పక్ష పాతంగా తమ పత్రిక లో రాయటం లేదా మా దృష్టిలో పెట్టటంజరిగిందన్నారు.గడచిన అయిదు సంవత్సరాల కాలం లో కౌన్సిలర్ లకు మీడియా సహాకారం మరువలేనిదనికృతజ్ఞతలు తెలిపారు.వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు మాట్లాడుతూ మీడియా లో ఎంతో సీనియర్ అయిన శంకర రావు తాను వార్డు కౌన్సిలర్ అయిన నాటి నుంచీ సహాయ సహాకారాలు అందిస్తూ వచ్చారని గుర్తు జేసుకున్నారు.
వ్యక్తి గతంగా తన పురోభి వృద్ధి గురించి కూడా తమ పేపర్లో వార్తలు రాశారని కృతజ్ఞతలు తెలిపారు.
మున్సిపల్ కమీషనర్ కే వి రమణ మాట్లాడుతూ సీనియర్ గా శంకర్రావు ఈ గుర్తింపు కు అర్హుడని అభినందనలుతెలిపారు.రాబోయే రోజుల్లో మరింతగా పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆకాంక్షించారు.
సీనియర్ వైసీపీ నేత కౌన్సిలర్ పి పి ఎన్ చంద్ర రావు మాట్లాడుతూ తగిన సమయం లో శంకర రావు ను ప్రభుత్వం గుర్తించి మీడియాలో అందరికీ ఉపయోగం అయిన అక్రిడి టేషన్ సభ్యులు గా అవకాశం ఇవ్వడం సంతోషం అన్నారు.
కార్యక్రమం లో చివర గా మాట్లాడిని బత్తిన చిన్నా గత రెండు దశాబ్దాల పరిచయం శంకర రావు తో అన్నారు.మీడియా లో సీనియర్ అయిన ఆయన్ను ఈ పదవికి ఎంపిక చేయడం అందరినీ గౌరవించడం అని అభివర్ణించారు.సమావేశం
నిర్వహించిన జంగారెడ్డిగూడెం డివిజన్ మీడియా అధ్యక్షులు పి ఎన్ వి రామారావు మాలో సీనియర్ పాత్రి కేయుడైన శంకర రావు కు ఎంతో ప్రతిష్టాకరమైన అక్రిడీటేషన్ కమిటీ మెంబర్ రావడం ముదా వహం అని కొనియాడారు. గత మూడున్నర దశాబ్దాల కాలం లో ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో ఈ హోదా గుర్తింపు పొందినమొదటి వ్యక్తి శంకర్రావు అభినందనీయుడని పేర్కొన్నారు.
కార్యక్రమం లోభాగంగా చైర్ పర్సన్ బత్తిన లక్ష్మి చిన్నా, వైస్ చైర్మన్ వీరాంజనేయులు, పి పి ఎన్ ప్రబృదులు శంకర్రావు ను దుస్సాలువతో సత్కరించారు.తనను గుర్తించి సత్కరించిన చైర్ పర్సన్, మిగతా కౌన్సిలర్ లకు సన్మాన గ్రహీత శంకర రావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో
కౌన్సిలర్లు నేకూరి కిషోర్, ఉగ్గం దుర్గా ప్రసాద్, చిటికిన అచ్చి రాజు,మేకా రామాదేవి,ఎల్ వి యార్, కనుమూరి లావణ్య,కటారి వాసు,వలవల తాతాజీ, సంకు సురేష్ తదితరులు పాల్గొన్నారు.ప్రింట్ మీడియా జర్నలిస్ట్ లు మంజీరగళం ఏలూరుజిల్లా ఇంఛార్జ్ కలపాల శ్రీనివాసరావు,ఉప్పల కృష్ణ, నూజివీడు కిషోర్,కడలి గాంధీ,నెట్రూ గణేష్,గరువు బాబూ రావు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు తోట నాగ బాబు, కాగిత సత్య, శ్రీరామ్ తదితరులు హాజరైనారు.


