ఘనంగా జర్నలిస్ట్ కలపాల శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు.

 ఘనంగా జర్నలిస్ట్ కలపాల శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు.


ఏ పి డబ్ల్యూ జె ఎఫ్  ఆధ్వర్యంలో శ్రీ వారాహి ఆఫీసులో  ఏలూరుజిల్లా ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ కలపాల శ్రీనివాసరావు పుట్టినరోజు శుభాకాంక్షలు బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏ పి డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అక్రిడి టే షన్ కమిటీ మెంబర్ కె ఎస్ శంకర్రావు మాట్లాడుతూ పాత్రికేయులందరిలో తలలో నాలుకల ఉంటూ అందరి మన్ననలు పొందిన శ్రీనివాసరావు కి శుభాకాంక్షలు తెలిపారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 4 వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ మాట్లాడుతూ స్నేహశీలి కలపాల శ్రీనివాసరావు వ్యక్తిత్వం ఎంతో గొప్పదని కొనియాడారు అనంతరం జర్నలిస్ట్ శ్రీనివాసరావు ని దుస్సాలువాతో ఘనంగా సత్కరించి పూల మాలలతో అభినందించి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏ పి డబ్ల్యూ జె ఎఫ్ మండల అద్యుక్షులు గొల్లమందల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.మండల కార్యదర్శి పి ఎన్ వి రామారావు, సినీ డైరెక్టర్ బి వి వర్మ,పాత్రికేయులు నూజీవీడు కిషోర్, భీమవరపు శ్రీనివాసరావు, కళాకారులు వానపల్లి జగదీష్, కె వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.