జన సేన పార్టీ సభ్యత్వం కి హాజరైన ఎమ్మెల్యే ధర్మరాజు..

 జన సేన పార్టీ సభ్యత్వం కి హాజరైన ఎమ్మెల్యే ధర్మరాజు..


బాపట్ల జిల్లా, రేపల్లె పట్టణంలో ఓల్డ్ టౌన్ అంకమ్మ చెట్టు సెంటర్లో గురువారం జనసేన పార్టీ  సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉంగుటూరు ఎమ్మెల్యే వై ధర్మరాజు పాల్గొన్నారు. సభ్యత కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర మత్స్యకారుల కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు రేపల్లె టౌన్ ప్రెసిడెంట్ మహేష్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గరికపాటి వెంకట గిరిధర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మత్తే భాస్కరరావు, ఎలక్ట్రికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వడ్డే వెంకటేశ్వరరావు చంటి రూరల్ మండలం ప్రెసిడెంట్ రేపల్లె జానకి రామయ్య మొదలగువారు సభలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ధర్మరాజు  మాట్లాడుతూ జనసేన పార్టీ మరింత బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సభ్యత్వ నమోదు వలన పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని జనసేన పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని ప్రసంగించారు.