పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వ్యవసాయాధికారి డి ముత్యాలరావు.
ఏలూరుజిల్లా కామవరపుకోట మండలం, కామవరపుకోట మరియు వీరిశెట్టి గూడెం గ్రామాలలో బుధవారం నాడు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి డి ముత్యాలరావు రైతులతో మాట్లాడుతూ మొక్కజొన్న పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దృష్ట్య మొక్కజొన్న పంటలు లో అగ్గి తెగులు ఎక్కువగా కనిపిస్తుందని, తద్వారా దిగుబడులు తగ్గే అవకాశం ఉందని, ఈ తెగులు నివారణకు తప్పనిసరిగా రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ట్రై సైక్లోజోల్ మందును 120 గ్రాములు ఒక ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. రైతులు వారి యొక్క పొలముకు సంబంధించి రైతు విశిష్ట సంఖ్య తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. తద్వారానే వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా రైతుకి అందిస్తున్న సేవలు పథకాలు అందుతాయని తెలిపారు. కాబట్టి రైతులు ఆయా గ్రామాల్లో స్థానిక రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్ర సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది, పశు సంవర్ధక శాఖ సిబ్బంది, గ్రామ రైతు సోదరులు, పాల్గొన్నారు.


