ఎంపీ పుట్టా మహేష్ క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ.

 ఎంపీ పుట్టా మహేష్ క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ.


ఏలూరుజిల్లా బుధవారం ఏలూరు ఎంపీ  క్యాంపు కార్యాలయంలో CMRF చెక్స్ పంపిణి కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఢిల్లీ లో ఉన్న కారణంగా,  ఓఎస్డీ ఫణీంద్ర చేతుల మీదుగా చెక్కుల పంపిణీ నిర్వహించారు. వివిధ ఆరోగ్య సమస్యలతో ఆర్ధిక సహాయం కోరుతూ ఎంపీ కార్యాలయం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 87 మంది లబ్ధిదారులకి  55 లక్షల CMRF చెక్స్ పంపిణి చేశారు. తమ ఆరోగ్య సమస్య, ఆర్ధిక పరిస్థితులు వివరించగానే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్ధిక సహాయం అందేట్లు చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు పలువురు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. 
ఏలూరు పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన లబ్ధిదారులు, వారి సహాయకులు, పార్టీ నేతలు పలువురు భారీగా తరలి రావడంతో శాంతి నగర్ లోని ఎంపీ క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి, పోలవరం, ఏలూరు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు, ఎంపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.