పూజ్యబాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం

 పూజ్యబాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం


జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు కార్యాలయం ప్రాంగణంలో గురువారం ఏపి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా ఏలూరు జిల్లా తొలివిడతగా నియోజకవర్గానికి ఒక్కొక్క ఆటో చొప్పున 7 గ్రామ పంచాయతీలకు ఏపి స్వచ్ఛ ఆంధ్రకార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీలు సంయుక్తగా పాల్గొని ఎలక్ట్రికల్ ఆటోలను పంపిణీ చేశారు. 


ఈ సందర్భంగా ఏపి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుటకు, పరిశుభ్రంగా మార్చటం కోసం రాష్ట్రంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఒక ఉద్యమంగా ముందుకుతీసుకు వెళ్ళుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా 12 వేలు ట్రై సైకిల్స్, 5 వేలు పుష్  కాట్స్ అందించామని అన్నారు. పైలెట్ మేనేజ్మెంటు ప్రాసెస్ ద్వారా 200 ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ చేశామని, ఈ రోజున ఏలూరు జిల్లా ఆయా గ్రామ పంచాయతీ  కార్యదర్శులకు అందించామని అన్నారు. రెండు పేజ్ లో రాష్ట్రంలో 3 వేలు ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీకి రంగంసిద్ధం చేస్తున్నామని అన్నారు. జిల్లాలో 8 చోట్ల  ప్లాస్టిక్ మేనేజ్మెంటు యూనిట్లు స్థాపనకు శ్రీకారం చుట్టనున్నామని  ఒక్కొక్క ప్లాంటుకు రూ 17 నుండి రూ 18 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా నిర్వహణ ఖర్చులు బాగా తగ్గుతాయని పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రకార్పొరేషన్ ద్వారా అందజేస్తున్న ఈ ఎలక్ట్రికల్ ఆటోలు పరిశుభ్రత కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగేందుకు దోహదపడతాయని తెలిపారు. ఇంటి నుంచి తడి, పొడి చెత్తను నూటికినూరుశాతం సేకరించాలని అన్నారు. ప్రతినెల మూడో శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరిలో ఆలోచనలు కలిగి మంచి ఫలితాలను ఇస్తుందని అన్నారు. గ్రామస్థాయిలో ప్రతిరోజు చెత్తసేకరణ అనంతరం చెత్తను డంపింగు యార్డులకు తరలించేందుకు ఈ ఎలక్ట్రికల్ ఆటోలను స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నామని తెలిపారు.


జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు పారిశుద్ధ్య సేవలు, పరిపాలనా కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏపీ స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ కార్యక్రమం మంచి శుభపరిణామం అన్నారు. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం ద్వారా ఇంధన వ్యయం తగ్గడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించ వచ్చునని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, పన్నులు వసూళ్లు, అభివృద్ధి పనులు పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు వేగవంతం కావడానికి ఈ వాహనాలు దోహదపడతాయని తెలిపారు. గ్రామ పంచాయతీలు పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం, గ్రామీణ సేవలను సమర్థవంతంగా అందించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు.


జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య, సుపరి పాలనకు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ చెయ్యడం కూటమి ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం అన్నారు. గ్రామసీమల్లో పారిశుద్ధ్యం  , పన్నులు వసూళ్లు, అభివృద్ధి పనులు పర్యవేక్షణ వంటి సేవలు వేగవంతం కావడానికి ఈ వాహనాలు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. గ్రామ పంచాయతీలు సుపరిపాలనకు, పారిశుధ్యo మరింత మెరుగుపరిచి, ప్రజలకు మంచి సేవలు అందించడానికి కలసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలన్నారు. దశలు వారీగా జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలకు ఎలక్ట్రికల్ వాహనాలు, తదితరు వాహనాలు అందించుటకు అన్ని చర్యలు తీసుకుంటామని, అందుకు ఏపీ స్వచ్ఛంద కార్పొరేషన్ సిద్ధంగా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టరు  కె.ఉదయ భాస్కర్, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు,  జెడ్పీ సిఈవో యం.శ్రీహరి, జిల్లా పంచాయతీ శాఖ అధికారి కె.అనురాధ,  ఆర్డబ్ల్యూఎస్ యస్ ఇ జి.త్రినాధబాబు, వివిధ గ్రామాలు పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.