ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర దుకాణ యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న చిర్రి బాలరాజు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత రంగం మన సంప్రదాయం, సంస్కృతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభమని తెలిపారు. చేనేత కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు రావాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వారికి ఆర్థిక భరోసా కల్పిస్తాయని అన్నారు.చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా కళాకారుల జీవనోపాధి మెరుగుపడటమే కాకుండా, మన సాంప్రదాయ వృత్తులు సజీవంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు స్వయంగా చేనేత వస్త్రాలను వినియోగించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. అసెంబ్లీ ఆవరణలో ఇలాంటి దుకాణాల ఏర్పాటు ద్వారా ప్రజల్లో చేనేతపై మరింత అవగాహన పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది.


