వేసవికాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా చూస్తాం మండల పరిషత్ అధ్యక్షులు రామారావు....
వేసవికాలంలో మండలంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చూస్తాం మంచినీటి బోర్లు త్వరితగతిన రిపేరు చేపిస్తున్నట్లు మండల పరిషత్ అధ్యక్షులు గంజి మాల రామారావు పేర్కొన్నారు కొయ్యలగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి కే కిరణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మండలంలోని అందరు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు పశువులకు మరియు మనుషులకు నీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎంపీపీ పేర్కొన్నారు అనంతరం మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీలు అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు


