డా. అగర్వాల్ ఐ క్లినిక్ ప్రాంభ కార్యక్రమం లో అప్కాబ్ చైర్మన్ వీరాంజ నేయులు

 డా. అగర్వాల్ ఐ క్లినిక్ ప్రాంభ కార్యక్రమం లో అప్కాబ్ చైర్మన్ 

వీరాంజ నేయులు 


అందరికీ అందుబాటులో ఆధునిక కంటి వైద్యం ,పాల్గొన్నవివిధ పార్టీ ల ప్రముఖులు 

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం -డా. అగర్వాల్ ఐ క్లినిక్ ఏర్పాటు ద్వారా ఏజెన్సీ మెట్ట ప్రాంతం కూడలి జంగారెడ్డిగూడెం టౌన్ లో మోడరన్ కంటి వైద్యం 
అందరికీ అందు బాటులోకివచ్చిందని స్థానిక ప్రముఖులు పేర్కొన్నారు
 ఇటువంటి సేవలు 
 తేవడానికి  ఎవరు ముందుకు వచ్చినామంచి దే నని పేర్కొన్నారు. స్థానిక ఏలూరు రోడ్డు లోని  ఎస్ ఆర్ కాంప్లెక్స్ లో ప్రముఖ  హాస్పిటల్ డా. అగర్వాల్ ఐ క్లినిక్ ను 
రాష్ట్ర అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు బుధవారం ప్రారంభించారు.కార్యక్రమం పాల్గొన్న ప్రముఖులు 
ఏజెన్సీ మెట్ట ప్రాంతాలలో ఇటువంటి ఆధునిక నేత్ర వైద్యసేవలు మొదటి సారిగా అందు బాటులోకి రావడం 
హర్ష నీయం అన్నారు. అగర్వాల్ సంస్థ మెడికల్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ క్లినికల్ సర్వీసెస్ డా. సత్తి విజయ, మేకా శ్రీకాంత్,ఏపీ ఇంచార్జి రాజేష్ తమ క్లినిక్ ప్రత్యేకతలు తెలిపారు.ఈ నేపథ్యంలో పూజా కార్యక్రమం జరిగింది అనంతరం అతిధులను దుస్సాలువ ల తో ఘనంగా సత్కరించారు.
.........
ఉచిత కంటి పరీక్షలు..
........
  తమ క్లినిక్ లో అందరికీ ఉచితం గా కంటి పరీక్షలు నిర్వహించడం, కళ్ళ జోళ్ళు అందించడం తో పాటు అవసరం అయిన శస్త్రచికిత్స లు చేస్తామని ఈ సందర్బంగా రాజేష్ తెలిపారు. సమీపంలో రాజమండ్రి, ఏలూరు కేంద్రాలలో తమ క్లినిక్ లు వున్నాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా తమకు క్లినిక్లు వున్నాయని తెలిపారు.ఇది 351 బ్రాంచ్ అన్నారు.ఇక్కడ ప్రాధమిక స్థాయి టెస్ట్ లు ఫ్రీ గా చేస్తామని అవసరం అయితే 
వారం లో రెండు రోజులు అదనపు పరీక్షలు శస్త్రచికిత్సలకోసం ఏలూరు, రాజమండ్రి రిఫర్ చేస్తాం అని వివరించారు..ప్రస్తుతం ఇక్కడ ఇద్దరు అప్టో మేట్రిక్స్ అందుబాటులో ఉంటారని అన్నారు. మెరుగైన నాణ్యమైన వైద్యం కోసం తమ క్లినిక్ కు రావాలని ఆయన కోరారు.
కార్యక్రమం లో మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన లక్ష్మి, సీనియర్ నాయకులు కరాటం రాంబాబు, పరిమి సత్తి పండు,కొండ్రె డ్డి కిషోర్,జెడ్పి టిసి పోల్నాటి బాబ్జి, అర్జుల మురళీ కృష్ణ,పెనుమర్తి రామ్ కుమార్, రావూరి కృష్ణ, , బత్తిన చిన్న,  దాకారపు కృష్ణ, ముప్పిడి వీరాంజనేయులు,  ప్రబృదులు పాల్గొన్నారు.