అక్రమ తవ్వ కాలు అడ్డుకుని
8టిప్పర్లు, జేసిబి పోలీసులకు అప్పగింత.
పోలీసులసమక్షంలో తిరిగబడ్డ ప్రజలు
మట్టి మాఫియాకు చిన్నం వారి గూడెం గ్రామస్తుల వార్నింగ్
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మట్టి మాఫియా బరితెగిస్తోంది.
సోమవారం అర్ద రాత్రి జంగారెడ్డిగూడెం రూరల్ గ్రామం చిన్నం వారి గూడెం పంచాయతీ లోగల చిన్న పెద్ద చేరువు లో మట్టి తవ్వుకు పోయందుకు అక్రమార్కులు ప్రయత్నం చేయగా గ్రామం మొత్తం తిరగబడి జేసీబి ని లారీలనిఅడ్డు కుని పోలీసులకు అప్పగించారు.
భారీ జేసిబి ద్వారాఒకే సారి ముపై టన్నులు కేపాసిటీ కలిగిన పది టిప్పర్లు చెరువు వద్దకు రాగానే గ్రామస్తులు తవ్వకాలు జరగనివ్వలేదు. ఆ సమయం లో మట్టి తవ్వ కానికి వచ్చిన
అయ్యప్ప, శంకర రాజు అనే వారి పై అగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఎమ్మెల్యే, అధికారుల సపోర్ట్ వుంది మేము మట్టి తోలుకు వెళతామని వాళ్ళు చెప్పినా గ్రామస్తులు ససేమిరా వప్పు కోలేదు. ఎట్టి కేలకు రెండు గంటలు అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి వాహనాలు, జేసీబి సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో అధికారుల అండదండలు ఉన్నాయంటూ చెప్పిన మట్టి స్మగ్లర్ల మాటలునిజమే అని ఒక దశలో గ్రామస్తులు అగ్రహో దరులయ్యారు తాము మట్టి అక్రమ తొలకం పై పోలీసులు, వి ఆర్ వో ఎం ఆర్ వో లకు ఫోన్ చేసినా పట్టించుకోలేదని మండి పడ్డారు.గ్రామం లో ట్రాక్టర్ మట్టి తీసుకొని వెళితే కేసు పెట్టారని
వీరికి ఏ అనుమతి ఉంది అని నీలాదీశారు.అను మతులు ఉంటే పగలు మట్టి తొలకం చేపట్టాలని అర్ధరాత్రి వేళ భారీ యంత్రాలతో మట్టిని మాయం చేయటం కుదరదని భీష్మంచారు .మండలంలోని చిన్నవారిగూడెం సమీపంలో గత రాత్రి భారీ ఎత్తున మట్టి తవ్వకాలు ప్రారంభమయ్యానే సమాచారం తో పెద్ద సంఖ్య లో అక్కడికి జనం చేరారు.. అర్ధరాత్రి సమయంలో పెద్ద పెద్ద శబ్దాలతో జేసీబీలు, ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తుండటంతో స్థానిక రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకతాటిపైకి వచ్చిన ప్రజలు మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. గ్రామస్తులపై మట్టి మాఫియా అయ్యప్ప, శంకర్ రావు తమ అనుచరులతో కలిసి చిందులు తొక్కారు.తమకు అనుమతులున్నాయని చెప్పారు.అయినా వారు వెనక్కు తగ్గలేదు కాగా పోలీసులతో వాదన జరిగింది
ఈ సందర్బంగా 8లారీలు సీజ్ చేసినట్టు ఏ పోలవరం వీఆర్ వో శివ తెలిపారు.జేసిబి తేవటానికి ట్రాలీ కావాలని పేర్కొన్నారు.
కాగా పోలీసులు స్వాధీన పర్చు కున్న జేసిబి,లారీ లని విడిపించే ప్రయత్నం లో పట్టణ రాజకీయ ప్రముఖులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
కాగా పట్టుకొని సీజ్ చేసిన లారీ కి రూ 7500/- జరిమానా విధించి విడుదల కు తహసీల్దార్ ఆదేశాలు ఇచ్చారు.


