ఎంఎల్ఎ ఖాతా నుంచి రూ.12 లక్షలు మాయం లింక్ ఓపెన్ చేయడంతో ఘటన..!
పోలవరం ఎంఎల్ఎ చిర్రి బాలరాజు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు నగదు మాయం చేసిన ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఎంఎల్ఎకు జంగారెడ్డిగూడెంలోని ఇండస్ లాండ్ బ్యాంకులో ఖాతా ఉంది. సదరు ఖాతాకు ఫోన్ నెంబర్ లింక్ అవ్వనట్లు ఆర్టిఎ చలానా పేరుతో యాప్ లింక్ రాగా ఎంఎల్ఎ దానిని ఓపెన్ చేశారు. దీంతో అకౌంట్లో ఉన్న రూ.12 లక్షలు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు


