శ్రీశ్రీశ్రీ చింతాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళం

 శ్రీశ్రీశ్రీ చింతాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళం 

మంజీరా గళం.. ప్రతినిధి ...కొయ్యలగూడెం ...




మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ చింతాలమ్మ ఆలయ నిర్మాణానికి  గంగవరం గ్రామ జనసేన పార్టీ నాయకులు, వాడపల్లి రమేష్ , భావన విజయ దంపతులు లక్ష రూపాయలు ఆర్థిక విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. గ్రామ దేవత చింతాలమ్మ ఆలయ నిర్మాణానికి సహృదయంతో ముందుకు వచ్చి విరాళాలు అందచేసిన రమేష్ దంపతులను కమిటీ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో చింతాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు దుగ్గిన శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు.