ఏలూరుజిల్లావార్తలు
అంతరాష్ట్ర గంజాయి ముఠా పట్టివేత 598 కిలోల గంజాయి స్వాధీనం.
జంగారెడ్డిగూడెం,(మంజీరగళం)ప్రతినిధి మార్చి 06.
ఏలూరు జిల్లాలో ఆపరేషన్ వజ్రప్రహార్' లో భాగముగా తనిఖీల్లో సుమారు 598 కిలోల గంజాయిని స్వాధీనం రూ. 3.14 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్న జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఎస్ఐ క్రాంతి కుమార్ వారి యొక్క సిబ్బంది
ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో సాగుతున్న 'ఆపరేషన్ వజ్ర ప్రహార్' ఫలితాల నిస్తోంది. జీలుగుమిల్లి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 598 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ది. 05-03-2026 న సాయంత్రం 4.00 గంటల సమయంలో, జంగారెడ్డిగూడెం – అశ్వారావుపేట జాతీయ రహదారి NH 516 D పై తాటియాకుల గూడెం వద్ద గల ఆంధ్ర తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద జీలుగుమిల్లి ఎస్.ఐ శ్రీ వి. క్రాంతి కుమార్ మరియు వారి సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు.
జంగారెడ్డిగూడెం వైపు నుండి అశ్వారావుపేట వైపు వెళ్తున్న OD 07 AS 7775 నంబరు గల టాటా DCM వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా, అందులో భారీగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ముద్దాయిల వివరాలు
దిలీప్ కుమార్ మొహంతి (56): బిజిపూర్ గ్రామం, గంజాం జిల్లా, ఒరిస్సా రాష్ట్రం.
జనార్దన్ ప్రాదాన్ (42): బ్రహ్మపుర్ గ్రామం, ఒరిస్సా రాష్ట్రం.
దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం
నిందితులు ఈ గంజాయిని రాజమండ్రి శివారులోని బూరుగు పూడి నుండి లోడ్ చేసుకుని, మహా రాష్ట్రలోని బీడ్ ప్రాంతానికి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. వీరిపై జీలుగుమిల్లి పి.ఎస్ లో Cr.No.34/2026 U/S 8(c) r/w 20(b)(ii)(C), 29(1) of NDPS Act-1985 ప్రకారం కేసు నమోదు చేశారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు
గంజాయి (16 ప్లాస్టిక్ సంచులు) 597.930 కేజీలు (విలువ రూ. 2,98,96,500/-)
టాటా DCM వ్యాన్ (OD 07 AS 7775) విలువ రూ. 16,00,000/-
సెల్ ఫోన్లు 02 మొత్తం స్వాధీన సొత్తు విలువ సుమారు రూ. 3,14,96,500/-
ఈ కేసు దర్యాప్తును జీలుగుమిల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ B. వెంకటేశ్వరరావు ప్రారంభించి, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన సిబ్బంది:
శ్రీ V. క్రాంతికుమార్ (SI, జీలుగుమిల్లి)
హెడ్ కానిస్టేబుల్: K. నాగేశ్వరరావు (HC-1868)
కానిస్టేబుళ్లు: P. శ్రీరామ్ మణికంట, D. లక్ష్మణరావు, M. రవికుమార్, B. మహేష్ బాబు, T. శ్రీనివాస రెడ్డి, M. సురేష్.
అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు చేసి, కోట్లాది రూపాయల విలువైన గంజాయిని పట్టుకున్న జీలుగుమిల్లి సిఐ, ఎస్.ఐ మరియు వారి బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
మాదకద్రవ్యాల రవాణాపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటారు అని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.


