భూ యజమాని అనుమతి లేకుండా కౌలు గుర్తింపు కార్ట్ లు ఇవ్వాలి
గన్నవరం,(మంజీర గళం) ప్రతినిధి,
కృష్ణాజిల్లా ,గన్నవరం
కౌలు రైతులకు భూ యజమాని అనుమతి తో సంబంధం లేకుండా (లోన్ ఎల్జ్ బుల్టీ కార్ట్ లు) ఎల్ ఇ సి కార్డులు ఇవ్వాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టివి లక్ష్మణస్వామి, పంచకర్ల రంగారావు లు డిమాండ్ చేశారు.
గన్నవరం మండల కేంద్రంలో కామ్రేడ్ చింతపల్లి పాపారావు భవనంలో గన్నవరం మండల కౌలు రైతు సంఘం 4 వ మహాసభ శుక్రవారం రామినేని రవి అధ్యక్షతన జరిగింది
ఈ సందర్బంగా లక్ష్మణస్వామి, రంగారావు లు మాట్లాడు తూ
జిల్లాలో సొంత భూమి లేకుండా కౌలు వ్యవసాయం చేసే రైతులు అత్యధిక మంది ఉన్నారని, వాస్తవంగా వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టేది శ్రమ చేసేది వారేనని కానీ పెట్టుబడి సహాయం మాత్రం వారికి అందడం లేదని అన్నారు, పట్టా భూమి ఆధారంగా పెట్టుబడి సహాయం ఇస్తున్నారే తప్ప వాస్తవ సాగుదారులైన కౌలు రైతులను మాత్రం ప్రభుత్వం గుర్తించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించడంలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు సొంత భూమిలేని కౌలు రైతులందరినీ గుర్తించి 20వేల రూపాయలు సహాయం అందిస్తామని, భూ యజమాని తో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డు లు ఇస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ అమలు చేయాలంటే కౌలు రైతుల చట్టంలో మార్పు చేసి భూ యజమాని తో సంబంధం లేకుండా కార్డు ఇవ్వాలి, అదే విదంగా గ్రామ సచివాలయం పరిధిలో గ్రామ రెవెన్యూ అధికారి మరియు రైతు సేవ కేంద్రంలో వ్యవసాయ సహాయ అధికారి కౌలు రైతుల అధ్యయనం పరిశీలించి, గ్రామసభల ద్వారా కౌలు రైతులను గుర్తించి కౌలు చట్టం ముసాయిదానం ప్రకటించాలి అని కోరామని అయినా నేటి అసెంబ్లీ సమావేశాల సందర్బంగా అయినా చర్చించి అమలు చేస్తారని ఆశించామని ఎక్కడ కౌలు రైతుల ప్రస్తావన కాని వారి సమస్య లపై చర్చ గానీ జరగలేదని, ఇప్పటికైనా కౌలు రైతుల సమస్యల పై అసెంబ్లీలో చర్చించి ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తొలుత మహాసభ ప్రారంభ సూచకంగా ఉయ్యూరు అంజయ్య సంఘ పతాకం ఎగరవేశారు.
నూతన అధ్యక్ష, కార్యదర్శులు గా రామినేని రవిబాబు, కైలే ఏసుదాసు లను, మరో 7 గురు కమిటీ సభ్యులను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కౌలు రైతులకు భూ యజమాని తో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని మహాసభ మహాసభ డిమాండ్ చేసింది


