జంగారెడ్డిగూడెం,(మంజీరగళం)ప్రతినిధి మార్చి 27.
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ ఇలవేల్పు దేవత,పట్టణానికి ఉత్తరాన కొలువైయుండి
శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు.
ఆలయ కళ్యాణ వేదిక వద్ద ఉత్సవ మూర్తికి పంచామృత అభిషేకాలు, మూలవిరాట్టు కు సాయం సంధ్యా హారతి పూజలు, భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు.
డాక్టర్ రాజాన సత్యనారాయణ(పండు) మాట్లాడుతూ, అమ్మ వారి వస్త్రాలంకరణ పుష్పాలంకరణ ప్రసాద వితరణకు మరియు ఆలయ అభివృద్ధికి గొట్టుముక్కల వంశీ కుమార్ రాజు స్వాతి మణి దంపతులు రూ 25,116/ లు, దూబగుంట్ల వెంకటేశ్వరరావు వెంకట నాగసీతామహాలక్ష్మీ దంపతులు రూ 15,116/లు, నౌడు సత్య నూకరాజు పద్మ దంపతులు రూ 15,116/ లు, దివ్య ఫాన్సీ జంగారెడ్డిగూడెం వారు రూ 10,116/ లు, కాకాని శ్రీహరిరావు, రాజ్యలక్ష్మి దంపతులు రూ 5,116/ లు, కేతిరెడ్డి వెంకట రమణ కుటుంబ సభ్యులు రూ.5,116/ లు, నిమ్మగడ్డ సూర్యనారాయణ పద్మ దంపతులు రూ 5,116/ లుపోలుపర్తి దుర్గారావు వీరమణి దంపతులు రూ 5,116/ లు మరియు నిమ్మగడ్డ సత్యనారాయణ ( బాబీ) విజయలక్ష్మి దంపతులు రూ 5,116/ లు సమర్పించారు.
దాతల కుటుంబ సభ్యులను అమ్మ వారు ఎల్లవేళల కాచి కాపాడాలని అన్నారు.
ది.1.4.28 బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుండి లోక కళ్యాణార్థం 86వ చండీ హోమం జరుగుతుందని, పాల్గొనదలచిన భక్తులు ఆలయ కార్యాలయం వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు
శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ బృందం సభ్యులు చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో పులిహోర ప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబు,పోలుపర్తి రాము చింతకాయల అచ్చిరాజు, కంచర్ల నాగేశ్వరరావు మరియు ఆలయ కమిటీ సభ్యులు శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారని ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలియజేశారు.


