శ్రీ మద్ది అంజన్న సన్నిధిలో ఘనంగా జరిగిన రాములోరి కళ్యాణం.


శ్రీ మద్ది అంజన్న సన్నిధిలో ఘనంగా జరిగిన రాములోరి కళ్యాణం.


 ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం ఈరోజు అనగా ది.27.03.2026, గురువారము “శ్రీరామనవమి” పర్వదినము సందర్భంగా ఏలూరు జిల్లా, జంగారెడ్డి గూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు ఎర్ర కాలువ ఒడ్డున, తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానము నందు ఉదయం గం.9-00ని.ల నుండి “శ్రీ సీతారాముల కళ్యాణము” ఆలయ అర్చకులు మరియు వేద పండితులచే జరుపబడినది. ఈ కళ్యాణ కార్యక్రమములో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనినారు. అనంతరం శ్రీ స్వామి వారి తీర్ద ప్రసాదములు మరియు పానకం భక్తులకు అందజేసినారని ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలియజేసినారు.