మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎంపీడీవో కిరణ్ కుమార్ పేర్కొన్నారు

 మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎంపీడీవో కిరణ్ కుమార్ పేర్కొన్నారు 

మంజీరా గళం.. ప్రతినిధి ...కొయ్యలగూడెం ...




మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎంపీడీవో కిరణ్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక పరింపూడి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ముప్పిడి విజయ కుమారి తో కలసి ఎంపీడీవో మొక్కను నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో కిరణ్ కుమార్ మాట్లాడుతూ మొక్కలను పెంచడం వలన అవి పెరిగి వృక్షాలుగా మారి మనకు మంచి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయని, పర్యావరణ వాతావరణం కూడా సమృద్ధిగా ఉంటుందని ఆయన తెలిపారు. సర్పంచ్ విజయ కుమారి మాట్లాడుతూ వర్షాలు అధికంగా కురిసి, పంటలు బాగా పండాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి పర్యావరణాన్ని కాలుష్య కోరల్లో నుంచి రక్షించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రుక్మిణి, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.