శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు
శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు మరియు ది.15.3.26 ఆదివారం నుండి 62వ ఉగాది వార్షిక జాతర మహోత్సవాలు
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీనూకాలమ్మ అమ్మ వారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు.
అమ్మ వారి ఉత్సవ మూర్తికి పంచామృత అభిషేకాలు మూలవిరాట్ కు ఏకాదశ హారతి పూజలు వేద దర్బారు సేవ చతుర్వేద స్వస్తి నీరాజన మహా మంత్ర పుష్పాలతో సాయం సంధ్యా హారతి పూజలు ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర మహేష్ శర్మ బృందం నిర్వహించారు.
ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు) ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్యర్యంలో అభివృద్ది కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ది.15.3.26 ఆదివారం 62వ ఉగాది వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభం అవుతాయని అన్నారు.
ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9గంటల నుండి గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మ వారి ఆనవాయితీగా చీర సారే పట్టు వస్త్రాలు, 1008మంది సుమంగళులచే,మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పాలపొంగళ్ళు (బోనాలు) పుణ్య నదీ జలాల సహస్ర కలశాలతో మరియు గరగాటలతో భారీ శోభాయాత్ర నిర్వహించబడును అని అన్నారు.పాల్గొనదలచిన భక్తులు ఆదివారం ఉదయం 9గంటలకు గంగానమ్మ అమ్మ వారి ఆలయం వద్దకు రావాలని డాక్టర్ రాజాన అన్నారు.
అమ్మ వారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ మరియు ఆలయ అభివృద్ధికి కంచుమర్తి సూర్య ప్రకాష్ లక్ష్మీ కుమారి దంపతులు రూ 5,116/లు, మరియు గుళ్ళపూడి సీతారాంబాబులక్ష్మీ భవాని దంపతులు రూ 5,116/లు విరాళంగా సమర్పించారని వారికి అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని అన్నారు చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు పులిహోర ప్రసాద వితరణ చేశారు.
అమ్మ వారి వెండి చీర తయారీ పూర్తికి వెండి రూపంలో ధన రూపంలోనూ మరియు పాత వెండి వస్తువులు సమర్పించి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆలయ కమిటీ సభ్యులు చిటికెన రాంబాబు, గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు,పోలుపర్తి రాము, రొంగల సత్యనారాయణ, చింతకాయల అచ్చిరాజు, కోరుపూరి రాంబాబు మరియు తిరుపతి త్రిపుర రమేష్ తదితర పట్టణ ప్రముఖులు, మహిళా కమిటీ సభ్యులు, బాల దుర్గా లలిత పారాయణ మండలి సభ్యులు,సేవా బృందాల సభ్యులు మరియు గ్రామ భక్త మహా జనులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతంచేసి ప్రసాద వితరణ చేశారనీ ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు తెలియజేశారు తెలియజేశారు.


