ఏలూరుజిల్లావార్తలు.

 ఏలూరుజిల్లావార్తలు

అభివృద్ధి కి చిరునామా మా 
  ప్రభుత్వ మే వైసీపీ నేతలు 
..................
మున్సిపాలిటీలో పనులపై పోస్టర్ విడుదల చేసిన నాయకులు 
..................

జంగారెడ్డిగూడెం,(మంజీరగళం)ప్రతినిధి మార్చి 06.
 

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం గత ఐదు సంవత్సరాల నుండిస్థానిక మున్సిపాలిటీలో వైసీపీ ప్రభుత్వంద్వారా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఎప్పటికి మర్చిపోరని సీనియర్ నేత వైసీపీ మచిలీపట్నం పరిశీలకుడు జెట్టిగురు నాధరావు  పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడి పాత బస్టాండ్ వద్ద గల సీనియర్ నాయకుడు గురునాధ రావు కార్యాలయం వద్ద మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల పై పోస్టర్ రిలీజ్ చేసారు.
చింతలపూడి నియోజకవర్గం ఇన్చార్జ్ కె విజయరాజు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు పట్టణవైసిపి అధ్యక్షుడు కర్పూరం గుప్తా, మండల అధ్యక్షుడు ఓరుగంటి నాగేంద్ర పార్టీ నాయకులు బి వి ఆర్ చౌదరి, కౌన్సిలర్లు దుర్గాప్రసాద్,లావణ్య, కిషోర్ అచ్యుతరామయ్య,ఎల్విఆర్, పార్టీ నాయకులు బత్తిన చిన్న, ముప్పి డి శ్రీనివాసరావు, జెట్టి ఆదిత్య కుర్రు రవి,సర్పంచులు వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. విజయ రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత సుమారుగారూ 43 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేశారని ప్రధాన రహదారులు పూర్తి చేశారని అన్నారు.అలాగే జగనన్న కాలనీ  నుంచి అర్బన్ పిఎస్సీలు ఐటిఐ కాలేజ్ ఆర్డిఓ ఆఫీస్ ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ కౌన్సిల్  ఏర్పడిన తర్వాత పూర్తి చేశారని అభినందనలు తెలిపారు.పార్టీలకు అతీతంగా జంగారెడ్డిగూడెం పట్టణాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారని ప్రధాన రహదారులన్నీ వైసీపీ ఆధ్వర్యంలో పూర్తిచేశారని ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులందరినీ ఆయన కొనియాడారు.చైర్పర్సన్ బత్తిన లక్ష్మీ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి  పరిపాలనలో అవినీతికి తావు లేదని అభివృద్ధికి మాత్రమేఅవకాశం ఉందని అన్నారు.