ఏలూరుజిల్లావార్తలు.

 ఏలూరుజిల్లావార్తలు




బిజెపి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లిఖితపూర్వకంగా కమిషనర్ కు లేఖ అందజేసిన అధ్యక్షుడు తాటికొండ సుధాకర్.


జంగారెడ్డిగూడెం,(మంజీరగళం)ప్రతినిధి  మార్చి 05 


 ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం టౌన్ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను క్రోడీకరించి పట్టణ మున్సిపల్ కమిషనర్ కి ఒక లిఖితపూర్వక వినతి పత్రాన్ని పట్టణ బిజెపి అధ్యక్షుడు తాటికొండ సుధాకర్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది . ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు 
పట్టణంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూల్స్ ఏ రోడ్లు అయితే రద్దీగా ఉంటున్నాయో అక్కడ స్కూల్ జోన్స్ అని బోర్డులు ఏర్పాటు చేయాలి. 
అలాగే మాంసవిక్రియ దుకాణాలు కూరగాయల మార్కెట్లు రైతు బజార్ సపరేట్గా ఏర్పాటు చేయాలి.
అలాగే రోడ్ల ఆక్రమణలను తక్షణమే తొలగించాలి 
దోమల బెడద కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించాలి 
అలాగే రోడ్లమీద నిర్వహించే 
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పాల కేంద్రాల మీద తనిఖీలు నిర్వహించాలి. బయనేరు శివాలయం వద్ద ఉన్న వ్యర్ధాలను వేరే ప్రదేశాలకు తొలగించి, శివాలయం  కు వెళ్లే భక్తులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి . అలాగే డివైడర్లలో మొలిచిన మొక్కలు పాదాచార్లకు బైకు మీద వెళ్లే వాళ్లకి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి వాటిని కటింగ్ చేయించాలి
ఈ సమస్యలన్నిటిపై సానుకూలంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్  అంశాల వారిగా అన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 
అలాగే పట్టణ కార్యదర్శి కంచర్ల నరేష్  మాట్లాడుతూ త్వరలో ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు గురించి పెన్షన్లు, రేషన్ కార్డులు తల్లికి వందనం  మ్యుటేషన్ లాంటి పనులు ఉన్న వాటి గురించి ఇబ్బందులు  పడుతున్న ఆ సమస్యలను తీర్చడానికి బిజెపి శ్రేణులు జనతా వారధి అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వాటి ద్వారా మీరు సమస్యలు తెలియజేస్తే సంబంధిత డిపార్ట్మెంట్లకు వెళ్లి ప్రజలకు పనులు అయ్యేలాగా సహకరిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ జనరల్ సెక్రటరీ సునీల్ సింగ్ సాహూ, పట్టణ ఉపాధ్యక్షుడు సొలసా రవికుమార్, పట్టణ కార్యదర్శి కంచర్ల రమేష్ గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు, బిజెపి జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడు సాయి సింగ్ తివారి, బి .కే. విశ్వనాథ్  
పాల్గొన్నారు .