శ్రీరామ నవమికి చాట్రాయి పోలీసుల పటిష్ట బందోబస్తు.

శ్రీరామ నవమికి చాట్రాయి పోలీసుల పటిష్ట బందోబస్తు.


 ఏలూరు జిల్లా చాట్రా యి మండలం చను బండ కోదండ రామాల యంలో ప్రశాంతంగా శ్రీరామ నవమి వేడు కలు ఘనంగా జరిగా యి.ఈ వేడుకలలో నూజివీడు డిఎస్పికె వి వి ఎన్ వి ప్రసాద్ వారి ఫ్యామిలీ, నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్  కె రామ కృష్ణ వారి యొక్క సతీమణి శ్రీరామలవారి కళ్యాణ ఉత్సవము లో పాల్గొన్నారు.శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చాట్రాయి మండలం చనుబండ గ్రామం లోని ప్రసిద్ధ శ్రీ కోదండ రామా లయం వద్ద నిర్వహిం చిన సీతారాముల కళ్యాణ మహోత్సవం పోలీసుల పటిష్ట బందో బస్తు మధ్య  వైభవం గా,ప్రశాంతంగాముగిసింది. నూజివీడు డిఎస్పి శ్రీ కె వి వి ఎన్ వి ప్రసాద్, నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె. రామ కృష్ణ, ఆదేశాల పై  చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ తమ పోలీస్ సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాల్లో పకడ్బందీగా బందో బస్తు  నిర్వహించారు. కళ్యాణోత్సవాము మూడు రోజులు పాటు నిర్వహించే ప్రాంతాల లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయో గించి డ్రోన్ కెమెరాల ద్వారా మరియు సి సి కెమెరాల ద్వారా పర్య వేక్షణ చేస్తూ భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ల ను క్రమ బద్ధీకరించారు. ఆలయ మార్గంలో వాహనాల రాకపోక లకు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు.

 అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా ఆలయ ప్రాంగణంలో నిరంతరం నిఘా ఉం చారు. మహిళా భక్తుల కు మరియు వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంలో పోలీస్ సిబ్బందిచొరవచూపారు.ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీ డి. రామకృష్ణ మాట్లాడుతూ భక్తుల సహకారం మరియు సిబ్బంది అంకితభావం వల్ల వేడుకలు విజయ వంతంగా ముగిశాయని తెలిపారు. ఆధ్యాత్మిక ఉత్సవాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, భక్తు లు క్షేమంగా స్వామి వారిని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్ర మంలో చాట్రాయి పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొ న్నారు.