రెడ్డిగూడెం లో హెచ్ పి వి వ్యాక్సిన్ ప్రారంభం.

 రెడ్డిగూడెం లో హెచ్ పి వి వ్యాక్సిన్ ప్రారంభం.


                                                 రెడ్డిగూడెం మంజీర గళం ప్రతినిధి.

 రెడ్డిగూడెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో హెచ్ పి వి  వాక్సిన్ కార్యక్రమం ప్రారంభిచడం జరిగింది.
ఈ సందర్బంగా  పీహెచ్ సి  డాక్టర్.మణిబాబు  మాట్లాడుతూ "బాలికల ఆరోగ్య పరిరక్షణ "కు ఈ హెచ్ పి వి టీకా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. "14"సంవత్సరం నిండిన, 15 సంవత్సరలలోపు బాలికలకు హెచ్ పి వి టీకా ఉచితం గా ప్రతి ప్రాధమిక, సామాజిక, ఆరోగ్యకేంద్రం లలో, ఇవ్వడం జరుగుతుందని డాక్టర్  తెలిపారు.బయట మార్కెట్ లో ఈ టీకా సుమారుగా 3000 నుండి 4000 రూపాయలు ఉంటుందని తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ కార్యక్రమం ను ప్రారంభించారు.
ఈ టీకా వేయించుకోవడం వలన బాలికల ఆరోగ్య రక్షణ తో పాటు, గర్భశయ, మెడ కాన్సర్ ప్రమాదలను నివారించవచ్చునన్నారు. భారత ప్రభుత్వం యూనివర్సల్ ఇమ్మునైజషన్ ప్రోగ్రాం లో భాగంగా హెచ్ పి వి  టీకాలు వేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ టీకా పూర్తిగా ఉచితం గా అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లలో అందుబాటులో ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నకు తీసుకొని వచ్చి, ఈ సేవలు వినియోగించు కోవలసినదిగా వైద్యులు కోరారు.
ఈ కార్యక్రమం లో డాక్టర్. కీర్తి , స్టాఫ్ నర్స్ దుర్గ, ఫార్మసిస్ట్ బేబీ సరోజిని, సిహెచ్ఓ శ్యాంసుందరరావు, సూపెర్వైసోర్ భవాని, రాంకుమార్, ఏఎన్ఎం  లు సుమతి, సౌజన్య, మరియు రెడ్డిగూడెం ఆశ కార్యకర్తలు వాణి, ప్రమీల తదితరులు  పాల్గొన్నారు