చత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్ష శాస్త్ర విభాగంలో ఔషధ మొక్కలు ప్రాధాన్యతపై సర్టిఫికెట్ కోర్స్ ఆవిష్కరణ.


చత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్ష శాస్త్ర విభాగంలో ఔషధ మొక్కలు ప్రాధాన్యతపై సర్టిఫికెట్ కోర్స్ ఆవిష్కరణ.


 ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం చత్రపతి శివాజీ త్రి శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్. ప్రసాద్ బాబు అధ్యక్షతన వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఔషధ మొక్కలపై అవగాహన కల్పించడం కోసం 45 రోజులపాటు సర్టిఫికెట్ కోర్స్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. ఎన్.ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఔషధ మొక్కలు  మానవ ఆరోగ్యానికి, ఆయుర్వేద వైద్యానికి అత్యంత ముఖ్యమైనవని తులసి, కలబంద, వేప వంటి మొక్కలు  చర్మ వ్యాధులు, మరియు వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని మనకు తెలియకుండానే అనేక ఔషధ మొక్కలను ఇంట్లో తరచుగా ఉపయోగిస్తామని కరివేపాకు చూస్తే కళ్ళకు చాలా మంచిదని సహజంగా పెరట్లో లభించే మొక్కలను వాడటం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని అన్నారు. వృక్ష శాస్త్ర అధ్యాపకరాలు సిహెచ్ షాలిని మాట్లాడుతూ తులసి ఆకులను  నిద్రలేచిన తర్వాత ఆకులు నమలడం ద్వారా మలేరియా, డెంగ్యూ వంటి తీవ్రమైన వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు, పంటి నొప్పికి కూడా మంచిదని ఔషధ మొక్కలు భూమి ఉష్ణోగ్రతను తగ్గించి, తేమను సమతుల్యం చేస్తాయని ఈ సర్టిఫికెట్ కోర్సు విద్యార్థులకు చాలా ఉపయోగకరమని అన్నారు. జంతు శాస్త్ర అధ్యాపకురాలు ఆర్.విజయ దీపిక మాట్లాడుతూ సర్టిఫికెట్ కోర్సులో మొత్తం 30 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారని సర్టిఫికెట్ కోర్సు పూర్తయ్యే నాటికి ఔషధ మొక్కలకు సంబంధించిన విషయాలన్నింటినీ తెలుసుకొని వాటిని నిజజీవితంలో ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఐక్యూఏసి కోఆర్డినేటర్ డా. ఎం.మధు, సీనియర్ అద్యాపకులు డా. సిహెచ్ బదరీ నారాయణ ఇతర అధ్యాపక అధ్యాపకేతర  సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.