ఘనంగా వెంకయ్యస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం.


ఘనంగా వెంకయ్యస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం.


 ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం సీతారాముల కళ్యాణం నిర్వహించడం తమ పూర్వ జన్మ సుకృతమని భగవాన్ శ్రీ శ్రీ గొల్లగమూడి వెంకయ్య స్వామి సేవా కేంద్రం పి ఆర్ ఓ నాగసూరి బాలసుబ్రమణ్యం అన్నారు.  జంగారెడ్డిగూడెం లోని రాజారాణి కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా నిర్మాణం చేస్తున్న వెంకయ్య స్వామి సేవా కేంద్రం నందు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణకర్త బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 14 సంవత్సరాలుగా శ్రీరామనవమి కళ్యాణం నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలియజేశారు. భక్తులు దాతలు సహాయ సహకారాలతో ప్రతి ఏటా  సీతారామ స్వామి కళ్యాణం ఎటువంటి ఆటంకములో లేకుండా నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మరో రెండు మాసాలలో వెంకయ్య స్వామి సేవా కేంద్రం ఆశ్రమ నిర్మాణం పూర్తిస్థాయిలో జరుగుతుందని చెప్పారు. ఈనెల 28వ తేదీన వెంకయ్య స్వామి బాల ఆలయం నందు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పించినట్లు  ఆశ్రమ అన్నదాన నిర్వాహకురాలు చిన్ని రత్నకుమారి తెలియజేశారు. వాసవి క్లబ్ జంగారెడ్డిగూడెం గోల్డ్, వాసవి క్లబ్ గోల్డ్ వనిత, వాసవి క్లబ్ కపుల్స్ సభ్యులతో పాటు ఆశ్రమ సభ్యులు చిన్ని బాల భాస్కర్, నాగరాజు, కాకి వెంకటేశ్వరరావు, చౌడే ఫణి చంద్రశేఖర్, శ్రీ కల తదితరులు పాల్గొన్నారు.